వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.5,500లు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతుంది. భారీగా వంట గ్యాస్ ధర పెరిగింది. గ్యాస్ సిలెండర్ ధర రూ. 5,500 లకు చేరుకుంది

Update: 2022-07-14 07:07 GMT

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతుంది. భారీగా వంట గ్యాస్ ధర పెరిగింది. గ్యాస్ సిలెండర్ ధర 5,500 రూపాయలకు చేరుకుంది. సిలిండర్ కోసం ప్రజలు ఘర్షణలకు దిగుతున్నారు. ఇప్పటకే శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. ఈరోజు సాయంత్రం వరకూ ఎమర్జెన్సీ కొనసాగుతుందని ప్రకటించారు. మరోవైపు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన రిణిల్ విక్రమ్ సింఘే ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చేశారు.

నిత్యావసరాలు....
మరోవైపు పెట్రోలు ధర కూడా లీటరు రూ.500 లకు చేరుకుంది. నిత్యావసార వస్తువులు మండిపోతున్నాయి. సామాన్యుడు ఏదీ కొనలేని పరిస్థితి. ప్రభుత్వ అధికారులకు సెలవు ఇచ్చి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వ్యవసాయం చేయాలని ప్రభుత్వం చెప్పడంతోనే సంక్షోభం ఎంత ముదిరిందో అర్ధం చేసుకోవచ్చు. స్కూళ్లకు పూర్తిగా సెలవులను ప్రకటించారు. శ్రీలంక వాసులు ఎక్కువగా ప్రయాణాలకు సైకిల్ ను వినియోగిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన శ్రీలంక అధ్యక్ష ఎన్నిక జరగనుంది.


Tags:    

Similar News