అమెరికాలో కాల్పులు..నలుగురి మృతి
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.;
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ లోని ఇంగ్లెవుడ్ లోని ఒక ఇంట్లో పార్టీ జరుగుతుండగా కొందరు దుండగులు కాల్పులు జరిపారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
పార్టీ జరుగుతుండగా.....
ఈ కాల్పుల్లో ఇంట్లో పార్టీ చేసుకుంటున్న నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. అయితే కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.