గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఒకే కాన్పులో 9 మంది శిశువులకు జన్మనిచ్చిన మహిళ

ఓ మహిళ ఒకే కాన్పులో .. ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా 9 మంది శిశువులకు జన్మనిచ్చింది. షాకవుతున్నారా ? నిజమేనండి..

Update: 2022-12-23 05:07 GMT

9 babies guinness world record

సాధారణంగా గర్భిణులు కవల పిల్లలకు జన్మనివ్వడమే చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఒక్కోసారి ముగ్గురు లేదా నలుగురు జన్మించిన దాఖలాలు ఉన్నాయి కానీ.. వారిలో ఒకరు లేదా ఇద్దరు శిశువులు బలహీనంగా ఉండేవారు. కానీ ఒకే కాన్పులో తొమ్మిది మందికి.. అదికూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్న శిశువులు జన్మించడం నిజంగా వండరే.

ఓ మహిళ ఒకే కాన్పులో .. ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా 9 మంది శిశువులకు జన్మనిచ్చింది. షాకవుతున్నారా ? నిజమేనండి ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలంతా ఆరోగ్యంగా ఉండటం మరో విశేషం. గతేడాది ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చింది. మొరాకోలోని కాసాబ్లాంకాకు చెందిన సీసా అనే మహిళ గర్భం దాల్చిన 30 వారాలకు సిజేరియన్ ద్వారా ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలకు జన్మనిచ్చింది.
తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.. దాన్ని ప్రపంచ రికార్డ్ గా గుర్తించారు. ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చి ఆమె ప్రపంచ రికార్డ్ సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్ తన ఇన్ స్టా ఖాతాలో తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేసింది. తొలుత ఆ మహిళకు ఏడుగురు పిల్లలు పుడతారని భావించారట వైద్యులు. కానీ అదనంగా మరో ఇద్దరు పిల్లలు పుట్టడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆ తల్లీ, బిడ్డలంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.






Tags:    

Similar News