పాశ్చాత్య దేశాల్లో జరుపుకునే హాలోవీన్ పార్టీ తీవ్ర విషాదాన్ని నింపింది. హాలోవీన్ కోసం భారీగా ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. అయితే భారీగా జనం రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక ప్రముఖ మార్కెట్‌లో జరిగిన తొక్కిసలాటలో 149 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. హాలోవీన్ ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారని అధికారులు తెలిపారు. ఇరుకైన వీధుల్లో గందరగోళం ఏర్పడడంతో తొక్కిసలాటతో పాటూ.. ఇంకొందరు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారని అధికారులు తెలిపారు. బాధితులను కాపాడడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వందలాది దుకాణాలు, పార్టీ స్థలాలను కలిగి ఉన్న మెగాసిటీ సెంట్రల్ జిల్లా ఇటావాన్‌లో శనివారం రాత్రి సుమారు 1 లక్ష మంది ప్రజలు గుమిగూడినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.