ప్రధాని పదవికి రాజీనామా
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు
న్యూజిలాండ్ ప్రధాని పదవికి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. వచ్చే నెల మొదటి వారం నుంచి పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె అధికార లేబర్ పార్టీ సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 22న లేబర్ పార్టీ జెసిండా ఆర్డెర్న్ తదుపరి నాయకుడిని ఎన్నుకుంటుంది. ఈ ఏడాది అక్టోబరు 14న న్యూజిలాండ్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ లేబర్ పార్టీదే గెలుపు అని జెసిండా ఆర్డెర్న్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల విశ్వాసాన్ని...
జెసిండా ఆర్డెర్న్ 2017లో ప్రధాని పదవిని చేపట్టారు. మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీకి తక్కువ స్థానాలు వచ్చాయి. 129 సీట్లలో 64 స్థానాలను మాత్రమే లేబర్ పార్టీ గెలుచుకుంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, కరోనా సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల జెసిండా ఆర్డెర్న్ పై ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని భావిస్తున్నారు. అందువల్లనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓటమి పాలయింది. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ జెసిండా ఆర్డెర్న్ తన పదవికి రాజీనామా చేశారు.