మిస్ వరల్డ్ గా చెక్ రిపబ్లిక్ భామ

మార్చి 9న భారతదేశంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల 71వ ఎడిషన్‌లో

Update: 2024-03-10 03:14 GMT

మార్చి 9న భారతదేశంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల 71వ ఎడిషన్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచింది. ఆమె మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని గెలుచుకుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక జరిగింది. లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. క్రిస్టినాకు 70వ ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కా కిరీటం బహూకరించింది. క్రిస్టినా.. లా, బిజినెస్‌లో రెండు డిగ్రీలు చదువుతూ కూడా మోడల్‌గా పనిచేస్తోంది. ఆమె క్రిస్టినా పిస్కో ఫౌండేషన్‌ను కూడా స్థాపించింది. 28 సంవత్సరాల విరామం తర్వాత, మిస్ వరల్డ్ ఫైనల్ భారతదేశంలో జరిగింది.

మిస్ వరల్డ్ ప్లాట్‌ఫారమ్ తనకు గుర్తింపును ఇచ్చిందని. ఈ గుర్తింపుతో అనేక మంది వెనుకబడిన పిల్లలకు సహాయాన్ని అందించగలనని విశ్వాసం వ్యక్తం చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా ముఖేష్ అంబానీ, బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫరూకీ, నటి రుబీనా డిల్లక్ తో పాటు, షోబిజ్ ప్రపంచంలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ను చిత్రనిర్మాత కరణ్ జోహార్, మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్ హోస్ట్ చేశారు. షాన్, టోనీ కక్కర్, నేహా కక్కర్‌ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


Tags:    

Similar News