12 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి వచ్చిన మృత్యుంజయుడు

సుమారు 278 గంటల పాటు శిథిలాల కిందే ఉండిపోయిన ఆ వ్యక్తిని బయటికి తీసి.. హుటాహుటిన అంబులెన్స్ లో ఆస్పత్రికి..

Update: 2023-02-18 06:43 GMT

new survivor in turkey

టర్కీ, సిరియా దేశాల ప్రజలను భూంకంపం ఎంత అతలాకుతలం చేసిందో చెప్పనక్కర్లేదు. ఆ దేశాల పరిస్థితి చూసిన వారెవరికైనా.. హృదయం ద్రవిస్తుంది. ఈ ఘోర ప్రకృతి విపత్తుకి కొన్ని సంఘటనలు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. 12 రోజుల క్రితం సంభవించిన భూకంపం ధాటికి వేలాది మంది అసువులు బాసారు. కోట్లమంది నిరాశ్రయులయ్యారు. పన్నెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా, గడ్డకట్టించే చలిలో సాయం కోసం ఎదురుచూసిన వ్యక్తిని ఎట్టకేలకు కాపాడారు.

సుమారు 278 గంటల పాటు శిథిలాల కిందే ఉండిపోయిన ఆ వ్యక్తిని బయటికి తీసి.. హుటాహుటిన అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. 12 రోజుల తర్వాత మృత్యుంజయుడిగా వచ్చిన ఆ వ్యక్తిని.. థర్మల్ జాకెట్ లో చుట్టి, స్ట్రెచర్ పై పడుకోబెట్టి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులుగా శిథిలాల కింద ప్రాణాలతో ఉండటం నిజంగా ఒక అద్భుతమేనని అంటున్నారు అధికారులు. కాగా.. రెండ్రోజుల క్రితం 14 ఏళ్ల యువకుడిని కూడా కాపాడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ టర్కీ, సిరియా భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News