ఆ లిస్టులో నుండి ఎట్టకేలకు బయటపడిన పాకిస్థాన్

Update: 2022-10-22 01:10 GMT

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF).. ఏయే దేశాలు ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటాయో.. మనీ లాండరింగ్‌ కు పాల్పడుతూ ఉంటాయో.. ఆయా దేశాలను ఆ లిస్టులో చేరుస్తూ ఉంటారు. గత నాలుగు సంవత్సరాలుగా పాకిస్థాన్ ఆ లిస్టులోనే ఉంది. ఎట్టకేలకు పాకిస్థాన్ అందులో నుండి బయటపడింది. FATF గ్రే లిస్టులో నుండి పాకిస్థాన్ బయటపడింది. గ్రే లిస్టు దేశాల జాబితా నుంచి పాకిస్థాన్ ను తొలగించినట్టు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. 2018లో ఎఫ్‌ఏటీఎఫ్ పాక్‌ను గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా నగదు అక్రమరవాణాకు పాక్ అడ్డుకట్ట వేయలేకపోయిందంటూ ఎఫ్ఏటీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రే లిస్ట్‌లో ఉండటంవల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), యూరోపియన్ యూనియన్ నుండి సహాయం పొందడం పాక్ కు కష్టంగా మారింది. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాక్ కు గ్రే లిస్టులో ఉండటంతో మరింత చిక్కుల్లో పడేసింది.

ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి పాకిస్థాన్ బయటకు రావడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆనందం వ్యక్తం చేశారు. "పాకిస్థాన్ FATF గ్రే జాబితా నుండి బయటకు రావడం శుభపరిణామం.. ఇందుకోసం సంవత్సరాలుగా ప్రయత్నాలను చేస్తూనే వస్తున్నాం. మన సివిల్ & మిలిటరీ నాయకత్వాన్ని అలాగే నేటి విజయానికి కృషి చేసిన అన్ని సంస్థలను నేను అభినందించాలనుకుంటున్నాను. ఆప్ సబ్ కో బోహత్ బోహత్ ముబారక్ (మీ అందరికీ అభినందనలు)." అంటూ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News