పీకల్లోతు కష్టాల్లో ఇమ్రాన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్ రాజీనామా చేసే అవకాశాలు న్నాయి
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడంతో ఇమ్రాన్ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. ఇమ్రాన్ కూడా రాజీనామా చేసే దిశగా యోచన చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. ఇమ్రాన్ ఖాన్ పై దేశంలోనూ అసంతృప్తి తలెత్తింది.
రాజీనామా చేసే అవకాశం.....
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయిన తర్వాత ధరలు విపరీతంగా పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాల కారణంగానే దేశం ఈ పరిస్థితుల్లోకి వచ్చిందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. విపక్షాలన్నీ ఏకమై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. అన్ని విపక్షాలు ఏకం కావడంతో రాజీనామా చేయక ఇక ఇమ్రాన్ ఖాన్ కు వేరే దారి కన్పించడం లేదు. పాకిస్థాన్ పార్లమెంటులో 342 స్థానాలుంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ, ఆయనకు మద్దతిచ్చే పార్టీలకు 156 స్థానాలే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే మైనారిటీలో పడిపోయింది. వచ్చే ఏడాది పాక్ ఎన్నికలు జరగనుండటంతో ఇమ్రాన్ ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సమాయత్తమయ్యే అవకాశాలున్నాయి.