Modi In Russia: రష్యాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. గ్యాప్ రాలేదు-తీసుకున్నారు
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు మాస్కో చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన ప్రధాని మోదీ సాయంత్రం 5.10 గంటలకు మాస్కోలోని Vnukovo-II అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి రష్యా బలగాలు గౌరవ వందనం కూడా అందించాయి.
పుతిన్.. ప్రధాని మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. మరుసటి రోజు రష్యాలోని భారతీయ ప్రవాసులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. మాస్కోలో పర్యటన ముగిసిన తర్వాత.. ప్రధాని మోదీ జూలై 9, 10 తేదీలలో ఆస్ట్రియాకు వెళతారు. ప్రధాని మోదీ మొదటిసారి ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. 1983లో ఇందిరా గాంధీ తర్వాత 41 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనున్నారు.