యుద్ధ ట్యాంకర్లు...క్షిపణులు ... వార్ కు రెడీ

ఉక్రెయిన్ పై మూడు మార్గాల ద్వారా దాడులు చేసేందుకు రష్యా తన సైన్నాన్ని మొహరించింది.

Update: 2022-02-14 04:19 GMT

ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యా సిద్ధమయింది. మూడు మార్గాల ద్వారా దాడి చేసేందుకు తన బలగాలను మొహరించింది. దీంతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నెల 16వ తేదీన యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ నిపుణలు ఇప్పటికే హెచ్చరించారు. యుద్ధనివారణకు ప్రపంచ దేశాలు ప్రయత్నించినా ఫలితం లేదు. రష్యా యుద్ధానికే సమాయత్తమవుతున్నట్లు కనపడుతుంది.

మూడు మార్గాల ద్వారా....
ఉక్రెయిన్ పై మూడు మార్గాల ద్వారా దాడులు చేసేందుకు రష్యా తన సైన్నాన్ని మొహరించింది. ఈ మార్గాల ద్వారా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలన్నది రష్యా వ్యూహంగా కన్పిస్తుంది. తూర్పు ఉక్రెయిన్, బెలారస్, క్రిమియా మార్గాల్లో ఇప్పటికే యుద్ధట్యాంకులు, క్షిపణులతో రష్యా సైన్యం మొహరించింది. ఎప్పుడైనా దాడులకు దిగే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు తమ విమానాలను అనేక దేశాలు నిలిపివేశాయి. అమెరికాతో సహా అన్ని దేశాలు ఉక్రెయిన్ లో ఉన్న తమ ప్రజలు వెనక్కు రావాలని పిలుపునిచ్చాయి.


Tags:    

Similar News