రష్యా ప్రతిపక్షనేతకు 9 ఏళ్ల జైలు శిక్ష

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ కి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Update: 2022-03-23 04:19 GMT

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ కి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో పాటు 8.75 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ పై పుతిన్ ప్రభుత్వం అనేక కేసులను బనాయించింది. పుతిన్ ను ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న పేరు ఆయనకు ఉంది. అందుకే ఆయనపై తప్పుడు కేసులను పుతిన్ ప్రభుత్వం బనాయించిందని చెబుతారు.

రెండున్నరేళ్ల నుంచి.....
ఈ నేపథ్యంలో అలెక్సీ నావల్నీ మోసం, కోర్టు థిక్కరణ నేరాలకు పాల్పడినందుకు ఆయనకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పటికే అలెక్సీ నావల్నీ రెండున్నరేళ్ల నుంచి జైలులోనే ఉన్నారు. అయితే ఈ కేసులో ఆయన అప్పీల్ కు వెళ్లు వెసులుబాటును కోర్టు కల్పించింది. అలెక్సీ నావల్నీ వయసు 45 ఏళ్లు.


Tags:    

Similar News