పొంచి ఉన్న మరో ముప్పు.. జాంబీ వైరస్
అతి ప్రమాదకరమైన జాంబీ వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మానవాళిని అంతం చేసే వైరస్ లకు కొదవలేదు. ఎప్పటికప్పడు శాస్త్రవేత్తలు వాటిని కనిపెడుతూ మందులు కనిపెడుతుండటంతో వైరస్ లను కొంత మేర కట్టడి చేయగలుగుతున్నాం. అయితే అతి ప్రమాదకరమైన జాంబీ వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రష్యాలోని సైబీరియాలోని ఒక సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల మధ్య ఉన్న దానిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్లూంబర్గ్ నివేదికలో...
ప్రపంచంలో పెను విపత్తుకు దారి తీసే అవకాశాలున్నాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ కాలుష్యంతో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉన్న ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కూడా మంచు కరిగిపోతుంది. మంచు పలకల కింద ప్రమాదకరమైన వైరస్ లు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా జాంబీ వైరస్ ను కనిపెట్టినట్లు బ్లూంబర్గ్ నివేదికలో పేర్కొంది. ఈ ప్రమాదకరమైన వైరస్ మానవాళిపైకి రాకుండా శాస్త్రవేత్తలు విరుగుడు కనుగొనే ప్రయత్నంలో పడ్డారు.