Passport Rankings: మళ్లీ సింగపూర్ నంబర్ 1.. భారత్ ర్యాంక్ ఎంతంటే?

Update: 2024-07-24 06:47 GMT

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌లో భారతదేశం పాస్‌పోర్ట్ 82వ స్థానంలో నిలిచింది. భారతీయులు 58 దేశాలకు వీసా-రహిత ప్రవేశానికి అర్హులు. ఈ ర్యాంకింగ్ అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుండి వచ్చిన డేటాపై ఆధారపడింది. భారతదేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో 2023లో 84వ స్థానం నుండి ప్రస్తుత 82వ ర్యాంక్‌కు చేరుకుంది. ఇందులో స్వల్ప మెరుగుదల కనిపించింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ డేటా ప్రకారం, భారతదేశం ర్యాంకింగ్ 2006లో 71వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు 82వ ర్యాంక్‌కు పడిపోయింది. 2021లో అత్యంత దారుణంగా 90వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు కాస్త మెరుగుదల కనిపించింది.

సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా పేరుపొందింది. ఈ పాస్ పోర్ట్ 195 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను అందిస్తోంది. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ రెండవ స్థానంలో జపాన్‌తో జతకట్టాయి. ఈ దేశ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు 192 దేశాలకు యాక్సెస్‌ను అందిస్తుంది. మూడవ స్థానంలో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్‌లు ఉన్నాయి. 191 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి.


Similar News