సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు సోనియా గాంధీ వెళ్లనున్నట్లు..;
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు సోనియా గాంధీ వెళ్లనున్నట్లు ఇటీవలే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. వైద్యపరీక్షల నిమిత్తం సోనియా విదేశాలకు వెళ్లడం, ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెళ్లారు. కాగా.. సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో ఆగస్టు 27వ తేదీ (శనివారం) మృతి చెందినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం సాయంత్రం వెల్లడించింది. పాలోవా మయానో అంత్యక్రియలు ఆగస్టు 30వ తేదీన ముగిసినట్లు జైరాం రమేశ్ తెలిపారు.