భారీ తుపాను : వందమందికి పైగా మృతి

ఆఫ్రికాలోని మలావి దేశంలో తుపాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుపాను కారణంగా వంద మందికి పైగా మరణించినట్లు చెబుతున్నారు

Update: 2023-03-14 03:13 GMT

ఆఫ్రికాలోని మలావి దేశంలో తుపాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుపాను కారణంగా దేశంలో వంద మందికి పైగా మరణించినట్లు చెబుతున్నారు. తుపాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిలో అరవై మందిని గుర్తించారు. ఆఫ్రికా ప్రజలను తుపాను ఆందోనకు గురి చేస్తుంది. నెల రోజుల్లో ఈ తుపాను సంభవించడం ఇది రెండో సారి కావడంతో ప్రజలు బితుకు బితుకుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇళ్లు కూలిపోతుండటంతో...
ఫ్లెడ్డీ తుపాను దెబ్బకు వాగులు, వంగలు పొంగి పొరలుతున్నాయి. కట్టడాలు సయితం నీటిలో కొట్టుకుపోతున్నాయి. తుపాను దెబ్బకు దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విద్యుత్తు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.


Tags:    

Similar News