యుద్ధం అనివార్యం.. 16న ముహూర్తం
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మంది సైన్నాన్ని రష్యా మొహరించింది
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మంది సైన్నాన్ని రష్యా మొహరించింది. రష్యా యుద్ధం వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చర్చలు జరిపినా....?
యుద్ధం అనివార్యం మన్నది అగ్రరాజ్యమైన అమెరికా కూడా గ్రహించింది. తమ పౌరులను తిరిగి వెనక్కు రావాల్సి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపు నిచ్చారు. యుద్ధాన్ని నివారించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయంటున్నారు. యూరోపియన్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో చేరేందుకు సిద్ధమవ్వడం, సరిహద్దు వివాదాలతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇరు దేశాలు బలగాలు మొహరించడంతో యుద్ధం అనివార్యం అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.