Eggs : డజన్ కోడిగుడ్లు 399 రూపాయలా? కొనుగోలు చేసేది ఎలా?
పాకిస్థాన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర ధరలు నింగినంటాయి;
పాకిస్థాన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర ధరలు నింగినంటాయి. లీటర్ పెట్రోలు ధర 267 రూపాయలకు చేరుకుంది. డజన్ కోడిగుడ్ల ధర 389 రూపాయలకు విక్రయిస్తున్నారు. గత కొంత కాలంగా పాకిస్థాన్ లో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. గోదుమల నుంచి పప్పుల వరకూ ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పేద ప్రజలు ఆకలితో అలమటించి పోతున్నారు. పాకిస్థాన్ లో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పెట్రోలు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.
అప్పుల ఊబిలో కూరుకుని...
పాకిస్థాన్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నిత్యావసరాలను కూడా దిగుమతి చేసుకోలేక అవస్థలు పడుతుంది. అంతకంతకూ పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. అప్పులు చేసినా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూడటం మినహా మరేమీ చేయలేకపోతుంది. గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పులేదు. డాలర్ తో పాకిస్థాన్ రూపాయి విలువ మరింత పడిపోవడంతో ప్రజల స్థితిగతుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది.