పేలిన భారీ అగ్నిపర్వతం
పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో అగ్నిపర్వతం బద్దలయింది. దీంతో ఈ ప్రాంతంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు;
పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో అగ్నిపర్వతం బద్దలయింది. దీంతో ఈ ప్రాంతంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అడుగున్న ఉన్న అగ్ని పర్వతం బద్దలయినట్లు చెబుతున్నారు. అగ్ని పర్వతం బద్దలయిన తర్వాత పొగ కమ్ముకుంది. బూడిద ఎగిసి పడుతుంది. ఇక టోంగా రాజధాని సుకులోఫాలో 12 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
మందస్తు చర్యలతో...
దీంతో అమెరికాలోని పశ్చిమ తీరంలోని బీచ్ లన్నీ మూసివేశారు. హవాయి, అలస్కా, అమెరికా పసిఫిక్ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరించారు. సునామీని ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.