పెరిగిపోతున్న మంకీపాక్స్.. లైంగిక సంపర్కం విషయంలో జాగ్రత్త అంటున్న నిపుణులు

చాలా దేశాల్లో ఎంతో వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల నుండి 14 దేశాలకు ఈ వైరస్ పాకింది. మొత్తంగా 180 కేసులు నమోదయ్యాయి.

Update: 2022-05-23 03:18 GMT

మంకీపాక్స్ విపరీతంగా పెరిగిపోతోంది. చాలా దేశాల్లో ఎంతో వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల నుండి 14 దేశాలకు ఈ వైరస్ పాకింది. మొత్తంగా 180 కేసులు నమోదయ్యాయి. యూరప్‌లోని 9 దేశాల్లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్, యూకే దేశాల్లో కేసులు నమోదయ్యాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూసినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆ తర్వాత ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్స్ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదని నిపుణులు అంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ సలహాదారు మాట్లాడుతూ మంకీపాక్స్ లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. వేసవి నెలల్లో ఈవెంట్స్, ఫెస్టివల్స్ వంటి వాటికి యువత పెద్ద సంఖ్యలో హాజరవుతున్నందున కేసుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించారు. WHO వ్యూహాత్మక, సాంకేతిక సలహా బృందం ఛైర్మన్ డేవిడ్ హేమాన్ ఇప్పటివరకు గుర్తించబడిన కేసులు లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతున్నాయనే సిద్ధాంతంపై WHO పనిచేస్తోందని చెప్పారు. "ఇప్పుడు లైంగిక రూపంలో, జననేంద్రియాల కారణంగా మంకీ పాక్స్ ప్రజల్లోకి ప్రవేశించింది. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల వలె ఇది కూడా వ్యాప్తి చెందుతోంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోంది" అని హేమాన్ చెప్పారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ హేమాన్ మాట్లాడుతూ, నిపుణులు రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు మరిన్ని మార్గదర్శకాలను అందించే అవకాశం ఉందని అన్నారు. వేసవిలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని పలు దేశాల్లోని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. మంకీపాక్స్ వ్యాప్తి కోవిడ్ వ్యాప్తి లాగా పోలి లేదని హేమాన్ చెప్పారు. మంకీ పాక్స్ అంత సులభంగా వ్యాపించదన్నారు. "వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు," అని ఆయన చెప్పారు.


Tags:    

Similar News