భారీ భూకంపం..
మనీలా తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు..
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 గా నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. భూకంపం వల్ల భారీ నష్టం జరగవచ్చని హెచ్చరించారు. రాజధాని మనీలాకు 120 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గగుర్తించారు. మనీలా తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగుతు తీశారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధికారులను నియమించామని కలటగాన్ మున్సిపల్ అధికారి మెండోజా తెలిపారు. సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించిందని అధికారి రోనాల్డ్ టోర్రెస్ వెల్లడించారు.
ఈ భూకంపం వల్ల ప్రస్తుతానికి పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం లేదని సివిల్ డిఫెన్స్ కార్యాలయ సమాచార అధికారి డియాగో మరియానో తెలిపారు. అక్కడక్కడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2013 అక్టోబర్ లో సెంట్రల్ ఫిలిప్పీన్స్ లోని బోహోల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మరణించారు. దాదాపు 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.