కండోమ్ ను టెస్ట్ చేసిన రకుల్.. పేరెంట్ ఏమన్నారు ?

మొదట ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడు నా తల్లిదండ్రులకు చెప్పాను. వారు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారు.

Update: 2022-03-08 11:23 GMT

హైదరాబాద్ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కన్ను బాలీవుడ్ పై పడింది. ఎలాగైన బీ టౌన్ లో నిలదొక్కుకునేందుకు తెగ కష్టపడుతోంది. అందుకే విభిన్నమైన కథలను ఎంచుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో నటిస్తోన్న సినిమాల్లో ఛత్రివాలి ఒకటి. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించింది. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే.. రకుల్ కి ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటి సారి అయినప్పుడు.. అందుకు ఎలా ఒప్పుకుందంటూ నెటిజన్ల నుంచి ట్రోలింగ్ మొదలైంది. నెటిజన్ల ట్రోలింగ్ పై రకుల్ స్పందించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. "ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి.. కండోమ్ టెస్టర్ క్వాలిటీ హెడ్ గా మారిన ఓ అమ్మాయి కథ ఇది. ఇందులో మేము చూపించకూడనిది ఏది చూపించలేదు. సమాజంలో జరిగేదే చూపించాం. మొదట ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడు నా తల్లిదండ్రులకు చెప్పాను. వారు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. అందుకే ఈ క్యారెక్టర్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. అందులోనూ నా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. నేను చేసే ప్రతి సినిమా నా పేరెంట్స్ అంగీకారంతోనే చేస్తాను. ఎందుకంటే నా మొదటి ప్రేక్షకులు వారే కాబట్టి" అని చెప్పుకొచ్చింది.


Tags:    

Similar News