ఆ కారు ప్రభాస్ ది కాదు

తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నటుడు ప్రభాస్ కారుపై హైదరాబాద్ నగర పోలీసులు శనివారం కేసు నమోదు..

Update: 2022-04-17 08:57 GMT

హైదరాబాద్ : ట్రాఫిక్ పోలీసులు నాసిరకం నంబర్ ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్‌లపై స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. గత రెండు వారాల్లో 1,000 కేసులు బుక్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నందున బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించాలని పోలీసులు కారు యజమానులను కోరారు. అందులో భాగంగా పలువురు సెలెబ్రెటీలకు చెందిన కార్లకు ఫైన్స్ వేస్తూ ఉన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన కథనాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నటుడు ప్రభాస్ కారుపై హైదరాబాద్ నగర పోలీసులు శనివారం కేసు నమోదు చేసి జరిమానా విధించారనే వార్తలు వచ్చాయి.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో నంబర్‌ ప్లేట్‌, బ్లాక్‌ ఫిల్మ్‌ కారణంగా కారును ఆపారని వార్తలు వచ్చాయి. సబ్ ఇన్ స్పెక్టర్ కారుకు రూ.1600 జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి. వాహనంలో ప్రభాస్ లేడని తెలిపారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ప్రభాస్ పీఆర్ టీమ్ చెబుతోంది.
బ్లాక్‌ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్‌ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ. 1600 జరిమానా విధించారనే వార్తలు నిజం కాదని ప్రభాస్‌ పీఆర్‌ టీం స్పష్టతనిచ్చింది. ఈ ఫేక్‌ న్యూస్‌పై ప్రభాస్‌ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఆశ్రయించారు. కారు ప్రభాస్‌ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు. ఆ కారుకి, ప్రభాస్‌కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేశారు. దయచేసి గమనించగలరని పీఆర్‌ టీం చెప్పుకొచ్చింది.


Tags:    

Similar News