తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడి మృతి
తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ మరణించారు.;
తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ మరణించారు. ఆయన అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిరస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో శనివారం రాత్రి ఢిల్లీ గణేశ్ మరణించారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు కూడా ధృవీకరించారు.
400 చిత్రాలకు పైగా...
ఢిల్లీ గణేష్ మొత్తం 400 చిత్రాలకు పైగా నటించారు. ప్రేక్షకులకు బాగా సుపరిచితులు. ఢిల్లీ గణేశ్ మృతితో తమిళనాడు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు చిత్ర ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటుడిని కోల్పోయినట్లయింది.