మెగాస్టార్ చిరంజీవి తల్లి వీర ఫ్యాన్ ఎవరికో తెలుసా? చెప్పేసిన చిరంజీవి

ఏఎన్నార్ స్టెప్‌లను చూసి తాను డ్యాన్స్ లను నేర్చుకున్నానని మెగాస్టార్ చిరంజీవ అన్నారు;

Update: 2024-10-28 14:16 GMT
chiranjeevi, responded, tamans comments, music director
  • whatsapp icon

తాను ఇంట గెలిచి.. రచ్చగెలిచానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.హైదరాబాద్ లో జరిగిన ఏఎన్నార్ అవార్డు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమితాబచ్చన్ నుంచి చిరంజీవి ఏఎన్నాఆర్‌ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లి ఏఎన్నార్ ఫ్యాన్ అన్నారు. తాను తన గర్భంలో ఉన్నప్పుడు మొగల్తూరులో ఏఎన్నార్ సినిమా విడుదలయింది. అయితే మొగల్తూరు నుంచి నర్సాపూర్ కు జట్కా బండిలో కూర్చుని అమ్మ వెళ్లి కింద పడిపోయింది. తన తండ్రి కంగారు పడిపోయారన్నారు. ఇక సినిమా ఎందుకు అని ఇంటికి వెళదామని చెప్పినా వినకుండా సినిమాకు వెళ్లి చూసి వచ్చిందని, ఆ తర్వాత రెండు నెలలకు తనను ప్రసవించిందని చిరంజీవి తన తల్లి ఏఎన్నార్ సినిమాలు ఎంత ఇష్టపడేవారో గుర్తుకు తెచ్చుకున్నారు.

ఏఎన్నార్ స్టెప్ లంటే...
తనకు ఏఎన్నార్ స్టెప్ లంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఫిలిం ఇండ్రస్ట్రీలో డ్యాన్స్ లు వేయడానికి తాను ఆద్యుడినయితే, అందులో స్పీడ్, గ్రేస్ ను పెంచింది చిరంజీవి అంటూ ఏఎన్నార్ తనను ఒక ఇంటర్వ్యూలో ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు ఏఎన్నార్ అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన తండ్రి కూడా తన సినిమాలను చూసి ప్రశంసించేవారని,అయితే తన ముందు తనను మాత్రం అభినందించేవారు కాదని, తనకు ఆయుక్షీణమని చెప్పి ఆయన తన సినిమాలు బాగున్నా ఆయన పెద్దగా స్పందించేవారు కారని అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి అన్నారు.


Tags:    

Similar News