Ram mandir: అయోధ్యలో తక్కువ ధరకే రూమ్ లు దొరకాలంటే?
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతూ ఉంది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు
Ram mandir: అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతూ ఉంది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు, యాత్రికులు అయోధ్యకు తరలిరానున్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా యాత్రికులు, భక్తులు వారికి కావలసిన వసతి కోసం గదులను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ‘హోలీ అయోధ్య’ యాప్ ద్వారా అతిధులు సులువుగా గదులు బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయిన హోమ్‌స్టేలలో అతి తక్కువ ధరలకు అద్దె గదులను పొందవచ్చు.
హోమ్‌స్టే పథకం కింద 500 కంటే ఎక్కువ భవనాలు, 2200 గదులు రిజిస్టర్ అయ్యాయి. గదుల అద్దె కూడా కేవలం రూ.1000 నుంచి ప్రారంభమవుతాయి. యాప్ ద్వారా భక్తులు మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా వారే స్వయంగా వారికి కావలసిన గదులకు బుక్ చేసుకోవచ్చు. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ తీసుకువచ్చిన యాప్ ను ఏడీఏ వెబ్‌సైట్ నుంచి లేదా గూగుల్ ప్లే స్టోర్ ద్వాకా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాప్ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అందుబాటులో ఉంది. బడ్జెట్‌కు తగిన గుదులు సెలక్ట్ చేసుకోవచ్చు. ఇందులో హోమ్‌స్టే ఓనర్ల కాంటాక్ట్ డీటేల్స్ తో పాటు హోమ్‌స్టేల రేటింగ్స్, రివ్యూలు, ఫొటోలు, ఫెసిలిటీస్, లొకేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో హోటల్స్, లాడ్జ్ లను కాకుండా కేవలం అయోధ్యలోని హోమ్‌స్టేల లిస్ట్స్ మాత్రమే చూపిస్తుంది. యూజర్లు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఈ-వాలెట్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవచ్చు.