నేడు తమిళనాడు బీజేపీ నిరసనలు
నేడు తమిళనాడులో బీజేపీ నిరసనలు తెలియజేయనుంది. మద్యం దుకాణాల వద్ద ఆందోళనను నిర్వహించనుంది.;

నేడు తమిళనాడులో బీజేపీ నిరసనలు తెలియజేయనుంది. మద్యం దుకాణాల వద్ద ఆందోళనను నిర్వహించనుంది. తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ కు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం అమ్మకాల ద్వారా అక్రమంగా అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకున్నారని ఆరోపిస్తూ ఈరోజు మద్యం దుకణాలవద్ద ఆందోళన చేయాలని నిర్ణయించింది.
ముందు జాగ్రత్త చర్యగా...
అయితే తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ తమిళనాడు నేతలను కొందరిని హౌస్ అరెస్ట్ చేసింది. కేవలం డీ లిమిటేషన్, భాషలపై తమ ప్రభుత్వం యుద్ధం చేయడం ప్రారంభించిన తర్వాతనే రాజకీయ కారణాలతోనే లిక్కర్ స్కామ్ అంటూ ఆరోపణలకు బీజేపీ దిగుతుందని అధికార డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో తమిళనాడులో నేడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.