రేపు భూమి మీదకు సునీతా విలియమ్స్
సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమిపైకి చేరడానికి ఇంకా గంటల సమయం పడుతుంది;

సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమిపైకి చేరడానికి ఇంకా గంటల సమయం పడుతుంది. రేపు సునీతా విలియమ్స్, విల్మోర్ భూమిపై దిగనున్నారు.క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్‌లో ప్రయాణం చేస్తూ భూమిని చేరుకోనున్నారు. గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉన్న సునీతా విలియమ్స్ రేపు భూమి మీదకు చేరుకుంటుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ల్యాండింగ్ తర్వాత...
రేపు తెల్లవారుజామున 2.41 గంటలకు ఇంజిన్లు ఆన్ అవుతాయని, ఉ.3.27 గంటలకు సముద్రంలో క్రూ డ్రాగన్ దిగనుందని నాసా ప్రకటించింది. ఫ్లోరిడా తీరంలో క్రూ డ్రాగన్ వ్యోమనౌక దిగనుంది. క్రూ డ్రాగన్‌ను సహాయక బృందాలు వెలికితీయనున్నాయని, ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించనున్నట్లు నాసా ప్రకటించింది.