నేడు లోక్ సభలో కీలక రిపోర్టులు
నేడు లోక్ సభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.;

నేడు లోక్ సభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశముంది. ఇదే సమయంలో కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ప్రధానంగా ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలపై కాంగ్రెస్ సభ్యులు తమ నిరసనను తెలియజేసే అవకాశముంది. ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన వెలువడే అవకాశముంది.
స్టాండింగ్ కమిటీ రిపోర్టులు...
నేడు లోక్‌సభ ముందుకు స్టాండింగ్ కమిటీ రిపోర్టులు రానున్నాయి. రక్షణశాఖ స్థాయీ సంఘం నివేదికను సభలో మంత్రలు రాధా మోహన్, వీరేంద్రసింగ్ లు ప్రవేశపెట్టనున్నారు. విదేశాంగశాఖ స్టాండింగ్ కమిటీ రిపోర్టును కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, గోవిల్ ప్రవేశపెట్టనున్నారు. సామాజికన్యాయ రిపోర్టును తెలుగు ఎంపీలు పీసీ మోహన్, జి.నగేష్ ప్రవేశపెట్టనున్నారు.