హిమాలయాల్లో ఫుట్ బాల్ స్టేడియం !

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ స్టేడియం.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. 30 వేల మంది

Update: 2022-02-09 11:15 GMT

హిమాలయాల్లో సాధారణ జనజీవనం అంటే.. ఎంత కష్టతరమో చెప్పనక్కర్లేదు. గడ్డకట్టే చలి.. జీవుల మనుగడకు సవాలు విసురుతుంది అక్కడ. అలాంటి ప్రదేశంలో ఏకంగా ఫుట్ బాల్ స్టేడియం నిర్మిస్తున్నారంటే.. నిజంగా అభినందించదగిన విషయమే. లడఖ్ లోని స్పిటుక్ వద్ద అత్యాధునిక సదుపాయాలున్న ఫుట్ బాల్ మైదానాన్ని నిర్మించారు. భారత్ లోనే అత్యంత ఎత్తైన సాకర్ మైదానం ఇది. ఈ స్టేడియం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు.

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ స్టేడియం.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. 30 వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.10.68 కోట్లు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం ఫిఫా కూడా లడఖ్ ఫుట్ బాల్ మైదానానికి పచ్చజెండా ఊపింది. ఈ మైదానం ఉపరితలాన్నంతటినీ ఆస్ట్రోటర్స్ తో నిర్మించారు. అలాగే ట్రాక్ ఈవెంట్లకు ఉపయోగపడేలా.. 8 లేన్లతో సింథటిక్ ట్రాక్ లను కూడా పొందుపరిచారు.




Tags:    

Similar News