గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం

దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 820 రూపాయలు పెరిగింది

Update: 2022-07-08 02:24 GMT

gold, silver, hyderabad

బంగారం ధరలు నిలకడగా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు వంటి కారణాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అందునా భారత్ లో బంగారం అంటే మహిళలకు మహా మక్కువ. ఇక్కడ బంగారాన్ని సంప్రదాయ వస్తువుగా చూస్తారు. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్ ఎక్కువ. బంగారాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడటం, పెట్టుబడిగా చూస్తుండటంతో భారత్ లో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.

ధరలు ఇలా...
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 820 రూపాయలు పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,850 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,110 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 62,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News