israel - Iran War - ఇజ్రాయిల్ పై విరుచుకుపడిన ఇరాన్... బాంబుల మోతతో దద్దరిల్లిన దేశం

ఇజ్రాయిల్ - హమాస్, హెజ్‌బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధం ఇక పతాక స్థాయికి చేరుకుంది. ఇరాన్ కూడా దిగడంతో టెన్షన్ నెలకొంది;

Update: 2024-10-02 02:02 GMT
israel,  hamas , hezbollah, iran,  war between israel - hamas, hezbollah war has reached peak, israel - Iran War latest news today telugu

 israel - Iran War 

  • whatsapp icon

ఇజ్రాయిల్ - హమాస్, హెజ్‌బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధం ఇక పతాక స్థాయికి చేరుకుంది. ఈ యుద్ధంలో ఇరాన్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడటంతో వార్ ఇక పీక్ స్టేజీకి చేరుకున్నట్లయింది. నిన్న దాదాపు ఐదు వందల క్షిపణులు, ర్యాకెట్లతో ఇజ్రాయిల్ పై దాడులకు దిగడంతో టెల్ అవీస్ ప్రజలు భయంతో వణికిపోయారు. అనేకభవనాలు నేలమట్టం కాగా, అనేక షాపింగ్ కాంప్లెక్స్‌లు ఈ బాంబులు, క్షిపణుల దాడుల్లో కూలిపోయాయి. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం తమ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని కోరింది. బాంబు షెల్టర్లకు వేలాది మందిని తరలించి కొంత వరకూ ప్రాణ నష్టం తగ్గించగలిగింది. ఈ బాంబుల దాడిలో ఆరుగురు మరణించారని పేర్కొంది.

ప్రతీకారంగానే....
హెజ్‌బుల్లా నేతల హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులు జరిగాయి. ఇటీవల లెబనాన్ పై దాడులతో హెజ్‌బుల్లాకు చెందిన ముఖ్యనేతలందరూ ప్రాణాలు విడిచారు. ఇరాన్ యుద్ధానికి దిగడంతో ఇజ్రాయిల్ రక్షణ మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ దాడులకు ఇరాన్ పాల్పడినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఎక్స్ లో నిర్ధారించాయి. ఇరాన్ కూడా ఈ దాడులకు తామే కారణమని నిర్ధారణ చేసింది. పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు అఫిషియల్‌గా ప్రకటించడంతో పాటు ఇజ్రాయిల్ కు ఇరాన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. తమపై ప్రతీకార దాడులకు దిగితే మరోసారి దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
అమెరికా కూడా...
అయితే అమెరికా హెచ్చరికలను ఇరాన్ పూర్తిగా పెడ చెవిన పెట్టి దాడులకు దిగింది. కానీ ఇరాన్ తో తాము ప్రమాదం ముందుగా ఊహించలేకపోయామని ఇజ్రాయిల్ మిలటరీ అంగీకరించింది. ఇక తాము కూడా రక్షణ వ్యవస్థను పటిష్టంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. దీంతో దక్షిణాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అమెరికా కూడా ఇజ్రాయిల్ మద్దతు తెలపడంతో భీకర యుద్ధానికి ప్రారంభం జరిగిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. మరో వైపు లెబనాన్ కూడా దాడులను ప్రారంభించింది. ఇప్పటి వరకూ వైమానిక దాడులకే పరిమితమయిన ఇజ్రాయిల్ ఇక గ్రామాలపై దాడులు ప్రారంభించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.


Tags:    

Similar News