మిధున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
బాలీవుడ్ నటుడు మిధును చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది.
బాలీవుడ్ నటుడు మిధును చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ ఏడాదికి ఈ అవార్డును మిధున్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార ప్రసారమంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబరు 8వ తేదీన జాతీయ చలనచిత్ర అవార్డు కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని మిధున్ చక్రవర్తి అందుకోనున్నారు.
బాలీవుడ్ లో నటుడిగా ఎదిగి...
పశ్చిమ బెంగాల్ కు చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించారు. బ్రేక్ డ్యాస్స్ అనేది మిధున్ ను చూసి ఇతర భాషా నటులు నేర్చుకున్నారంటారు. ఆయన కేవలం హీరోగానే కాదు సహాయనటుడు, విలన్ గా కూడా అనేక చిత్రాల్లో కనిపించారు. మిధున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిందీ, బెంగాలీతో పాటు తెలుగు చిత్రాల్లోనూ మిధున్ చక్రవర్తి నటించారు.