షాకింగ్.. పెరిగిన బంగారం ధరలు

తాజాగా దేశంలో పది గ్రాముల బంగారంపై రూ.220లు, కిలో వెండి పై 600 రూపాయలు పెరిగింది.

Update: 2022-07-15 02:12 GMT

గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. బంగారం అంటేనే అదీ మరి. బంగారం ధరల హెచ్చుతగ్గులు ఎప్పుడూ మామూలే. తగ్గినప్పడు స్వల్పంగా, పెరిగినప్పుడు ఎక్కువగా బంగారం ధర ఉంటుంది. ఇది వినియోగదారులకు కూడా అలవాటే. కానీ తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని ఎదురు చూడటం మంచి పద్ధతి కాదంటున్నారు మార్కెట్ నిపుణులు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాలతో హెచ్చుతగ్గుతులుంటాయని చెబుతారు. ఆషాఢమాసం కావడంతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మళ్లీ పెరుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ మార్కెట్ లో...
తాజాగా దేశంలో పది గ్రాముల బంగారంపై రూ.220లు, కిలో వెండి పై 600 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలు, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 62,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News