సీజేఐగా జస్టిస్ లలిత్ ప్రమాణం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లలిత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు హాజరయ్యారు.
74 రోజులో...
49వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా లలిత్ నియమితులయ్యారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా బాధ్యతలను చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అతి తక్కువ కాలం మాత్రమే పదవిలో ఉంటారు. రెండున్నర నెలల్లోనే ఆయన పదవీ కాలం ముగియనుంది