నేడు సీబీఐ ముందుకు సిసోడియా.. ఆప్ నేతలు హౌస్ అరెస్ట్

దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ ఫాలోవర్ నని చెప్పిన సిసోడియా.. ఈ కేసులో భాగంగా తాను జైలులో ఉండాల్సి వచ్చిన..;

Update: 2023-02-26 05:19 GMT
manish sisodia cbi enquiry

manish sisodia cbi enquiry

  • whatsapp icon

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి నేడు ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం పార్టీ మద్దతుదారులతో తన నివాసం నుంచి ర్యాలీగా సీబీఐ కార్యాలయానికి బయల్దేరారు. మధ్యలో మహాత్ముడి స్మృతివనం రాజ్ ఘాట్ ను సందర్శించారు. సీబీఐ అధికారుల విచారణకు తాను అన్నివిధాలా సహకరిస్తానని సిసోడియా తెలిపారు.

దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ ఫాలోవర్ నని చెప్పిన సిసోడియా.. ఈ కేసులో భాగంగా తాను జైలులో ఉండాల్సి వచ్చిన భయపడబోనంటూ ట్వీట్ చేశారు. మరోవైపు సీసోడియాను ఉద్దేశించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ట్విట్టర్లో స్పందించారు. "దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మనీశ్.. లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దీవెనలు నీపై ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లాల్సి రావడం శాపం కాదు, గౌరవం. నువ్వు జైలు నుంచి త్వరగా తిరిగి రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తా" అంటూ ట్వీట్ చేశారు. సిసోడియా సీబీఐ విచారణ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా.. పోలీసులు పలువురు ఆప్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.




Tags:    

Similar News