ప్రయాగ్ రాజ్ కు రైళ్లు తాత్కాలికంగా రద్దు
మహాకుంభమేళాలో తొక్కిసలాటతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది;

మహాకుంభమేళాలో తొక్కిసలాటతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. మౌని అమావాస్య కావడంతో ఒక్కసారిగా మహాకుంభమేళాకు పది కోట్ల మంది భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నారు. అయితే సంగం సమీపంలో ఈ తొక్కిసలాట జరిగి దాదాపు ఇరవై మంది మరణించడంతో ఇంకాభక్తులు అక్కడకు చేరుకోకుండా భక్తుల రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపేశారు.
రికార్డు స్థాయిలో...
ఇప్పటికే మహా కుంభమేళాలో రికార్డు స్థాయిలో భక్తులు చేరుకోవడంతో రైళ్లలో మరింత వచ్చి ఇంకా ఇబ్బంది ఎదురవుతుందని భావించి రైళ్లను నిలిపి వేసింది. అయితే కేవలం తాత్కాలికంగా మాత్రమే రైళ్లను ప్రయాగ్ రాజ్ కు రద్దు చేశామని, అక్కడ పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తిరిగి కొనసాగిస్తామని రైల్వే శాఖ చెబుతుంది. రైళ్లు రద్దుతో ప్రయాగరాజ్ కు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.