Ayodhya : రాముడి కోసమే జన్మించానంటూ.. మూడు దశాబ్దాలుగా...? పెదవి విప్పకుండా...?

జార్ఖండ్ లోని ధన్‌బాద్ జిల్లాలో కరమ్‌తాండ్ లో ఉంటున్న సరస్వతీదేవి అగర్వాల్ ముప్పయి ఏళ్లుగా శ్రీరాముడి ధ్యానంలో ఉన్నారు.

Update: 2024-01-09 05:21 GMT

saraswati devi agarwal

శ్రీరామ నీ నామమెంత రుచిరా.. అంటూ సాగే పాట ఎంత వినసొంపుగా ఉంటుందో... అదే తరహాలో రాముడు అంటే భక్తి భావంతో మునిగిపోయే వారు అనేక మంది ఉంటారు. అయితే వాళ్లు ఎవరూ ప్రచారాన్ని కోరుకోరు. తాము రామ భక్తులమని చెప్పుకోరు. మనసులోనే శ్రీరాముడిని స్మరిస్తూ కాలం గడిపేస్తుంటారు. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడం, ఈ నెల 22వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరుగుతుండటంతో అనేక ఆసక్తికరమైన కథనాలు వెలుగు చూస్తున్నాయి. శ్రీరాముడి అంటే ఎంతో భక్తితో భావించి ఆయననను మనసులో సర్మించుకుని ధ్యానం చేసే వారు కూడా ఉన్నారు.

ముప్పయి ఏళ్ల నుంచి...
ఎనభై ఏళ్ల వృద్ధురాలు దాదాపు మూడు దశాబ్దాల నుంచి మౌనవ్రతం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లాలోని కరమ్‌తాండ్ లో ఉంటున్న సరస్వతీదేవి అగర్వాల్ ముప్పయి ఏళ్లుగా శ్రీరాముడి ధ్యానంలో ఉన్నారు. ఆమె మౌనంగానే రాముడిని ధ్యానిస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయ్యేంత వరకూ తాను ఎవరితో మాట్లాడనని ఆమె పెదవులకు తాళం వేసుకున్నారు. అంతే ముప్పయి ఏళ్ల నుంచి సరస్వతీ దేవీ అగర్వాల్ ఎవరితో మాట్లాడదు. రాముడి ఫొటో చూస్తూ ఆయన నామస్మరణ చేస్తూ కాలం గడుపుతూ వస్తుంది.
మౌనవ్రతాన్ని వీడేందుకు...
అయితే సరస్వతీ దేవి అగర్వాల్ కోరిక ఎట్టకేలకు తీరనుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి అయి ఈనెల 22న ప్రారంభానికి నోచుకోవడంతో ఆమె ఆరోజునే తన మౌనవ్రతాన్ని వీడనుంది. శ్రీరాముడికే తన జీవితం అంకితం అని చెబుతున్న సరస్వతీ దేవి అగర్వాల్ ను గుర్తించిన ప్రభుత్వం కూడా అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఆమె తన ప్రాణాలు వదిలేంత వరకూ అయోధ్యలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మహంత నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలో ఉండాలని భావిస్తున్నారు.
అయోధ్యకు చేరుకుని...
సరస్వతీ దేవి అగర్వాల్ మౌనవ్రతాన్ని వీడేందుకు అయోధ్యకు చేరుకున్నారు. ఆమె తొలిసారి 1992 మే లో అయోధ్యకు వచ్చి నాటి నుంచి మౌనవ్రతం ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీన ఆమె మౌనవ్రతాన్ని వీడనున్నారు. దీంతో రాముడి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసానికి అందరూ అచ్చెరువు చెందుతున్నారు. ఇలాంటి వారి వల్లనే అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధ్యమయిందని సాధువులు కూడా చెబుతున్నారు. ఇప్పుడు అయోధ్యలో సరస్వతీ దేవి అగర్వాల్ ఒక వీఐపీగా మారారు. అందరూ ఆమెను చూసేందుకు ఆశ్రమానికి తరలి వస్తున్నారు.



Tags:    

Similar News