KCR : మరోసారి ఆశీర్వదించండి : కేసీఆర్

మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. వర్థన్నపేటలో జరిగన సభలో ఆయన మాట్లాడారు

Update: 2023-10-27 12:05 GMT

మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. వర్థన్నపేటలో జరిగన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో మనం అందరం చూశామన్నారు. 14 ఏళ్లు మనల్ని ఏడిపించి చివరకు తాను నిరాహార దీక్ష చేస్తే రాష్ట్రం ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలను రూపొందించుకుని వెళుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తొలగిస్తారని అన్నారు. అది తొలగిస్తే మళ్లీ రైతులకు కష్టాలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు.

మళ్లీ మూడు గంటలే...
కాంగ్రెస్ వస్తే మళ్లీ మూడు గంటలు కరెంటు ఖాయమన్న కేసీఆర్ ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలన్నారు. ఎవరో ఏదో ఇచ్చారనో, చెప్పారనో ఓటు వేయడం తగదని ఆయన అన్నారు. మన సమాజాన్ని బాగు చేసే వారికే మళ్లీ పట్టం కడదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్లు ఇప్పుడు వచ్చి రాష్ట్రాన్ని తాము బాగు చేస్తామని చెబుతున్నారని, వారి మాటలను నమ్మవద్దని తెలిపారు. వర్థన్నపేట నుంచి మరోసారి రమేష్ ీఅత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News