Leopard : అదిగో పులి.. అటువైపు వెళితే ఇక అంతే

కుమురం భీం జిల్లాలో చిరుత పులి సంచారం ప్రజలను హడలెత్తిస్తుంది.

Update: 2024-11-19 05:43 GMT

కుమురం భీం జిల్లాలో చిరుత పులి సంచారం ప్రజలను హడలెత్తిస్తుంది. కుమరంభీం జిల్లా జైనూరు అడవుల్లో పులి సంచారం ఉన్నట్లు కనుగొన్నారు. పశువులపై దాడి చేయడంతో రాశిమెట్టగూడెం వాసులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండు పశువులు పులి దాడిలో మరణించడంతో గిరిజన ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.

చాటింపు వేయించి...
అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి పులి సంచారపై ఆరా తీశారు. పులి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. పొలాలకు వెళ్లవద్దని, అడవుల్లోకి అడుగు పెట్టవద్దని అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంత వాసులను హెచ్చరించారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతంలో చాటింపు వేయించారు. బేస్ క్యాంప్ లను ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags:    

Similar News