Harish Rao : అరెస్ట్ లను ఖండించిన హరీశ్ రావు
సర్పంచ్ ల అరెస్ట్ పై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచ్ ల అరెస్ట్ పై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ లకు పదకొండు నెలల నుంచి పెండింగ్ బిల్లులు రావడం లేదంటూ ఆయన మండిపడ్డారు. మాజీ సర్పంచ్ ల అరెస్ట్‌లను ఆయన ఖండించారు. వారితో పాటు ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇలాగే కొనసాగిస్తే మహారాష్ట్రలోనూ ఓటమి తప్పదని హరీశ్ రావు హెచ్చరించారు.
పెండింగ్ బిల్లులను పరిష్కరించాలని...
రాహుల్ గాంధీ వాళ్ల నాయన గ్రామ స్వరాజ్యం కోసం పాటు పడ్డారని, అలాంటి తండ్రికి తగ్గ కొడుకుగా తెలంగాణలో సర్పంచ్ ల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. పెండింగ్ బిల్లులను విడుదలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తమ భార్యల పుస్తెలు అమ్మి మరీ గ్రామంలో సర్పంచ్ లు అభివృద్ధి పనులను చేపట్టారని, వాటిని ఇవ్వాలని కోరితే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ సర్పంచ్ లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.