Rain Alert Today : నేడు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పడేది ఇక్కడేనట
వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది
వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అనేక చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా హైదరాబాద్ లో సాయంత్రం వర్షం కురినే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఉక్కపోత మాత్రం ప్రజలను వీడటం లేదు. వాతావరణం పొడిగా ఉండటంతో పగలంతా ఒకటే ఎండతీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
భిన్నమైన వాతావరణంలో...
సాయంత్రానికి వర్షం పడుతుంది. రాత్రి వేళకు చల్లగాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా తెల్లవారు జామున పెరిగింది. దీంతో అనేక చోట్ల చలిమంటలు కాచుకుంటున్నారు. ఈ భిన్నమైన వాతావరణంలో అనేక మంది అవస్థలు పడుతున్నారు. జ్వరం, జలుబు వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ వాతావరణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వాతావరణానికి రోగాలపాలై అనేక మంది ఆసుపత్రులకు తరలి వస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి.
ఏపీలో నేడు ఇక్కడ...
ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు పలుచోట్ల వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపారు. కొన్ని చోట్ల ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే సమయంలోనూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రోగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నేడు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.