Rain Alert : ఈరోజు తెలంగాణలో భారీ వర్షం.. బయటకు రాకపోవడమే మంచిది

తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2024-11-03 03:00 GMT

తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రానున్న మూడు గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌..రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఇటీవల కాలంలో ప్రతి రోజూ అకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారు. విధులకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. రహదారులన్నీ జలమయిపోతున్నాయి. చెరువుల్లా మారిపోతుండటంతో వాహనాలు వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆఫీసుల నుంచి బయలుదేరే సమయంలోనే ఈ వర్షం పడుతుండటంతో హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వర్షం పుడుతుందని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రైతులు కూడా...
ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలపడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఈరోజు ఇంటి నుంచి బయటకు రావడం మంచిది కాదని సూచించింది. రైతులు కూడా తమ ధాన్యం ఉత్పత్తులను జిల్లాల్లో కాపాడుకోవాలని, అకాల వర్షం కురుస్తుందని తెలిపింది. ఇటీవల అకాల వర్షాలు పడటంతో మెదక్ జిల్లాలో ధాన్యం తడిసి పోయి అనేక మంది రైతులు నష్టపోయారు. అదే సమయంలో తడిసిన ధాన్యాన్ని ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులు ఈరోజు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. తమ ధాన్యం తడవ కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని అధికారులు కూడా సూచిస్తున్నారు. భారీ వర్షాలు ప్రతిరోజూ కురుస్తుండటటంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. వీరు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మంచిదన్న సూచనలు చెబుతున్నారు.


Tags:    

Similar News