నేడు బీఆర్ఎస్ మహా ధర్నాలు
రైతు కల్లాలపై ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆంక్షలు విధించడంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆందోళనలు చేస్తుంది.
రైతు కల్లాలపై ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆంక్షలు విధించడంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆందోళనలు చేస్తుంది. జల్లా కేంద్రాల్లో మహా ధర్నాలను నిర్వహించాలని నాయకత్వం పిలుపు నిచ్చింది. కేంద్రప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ఆందోళనలకు దిగుతోంది.
కల్లాల నిర్మాణంపై...
ఈ ధర్నాల్లో రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా పార్టీ శ్రేణులు చర్యలు తీసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం నిర్మిస్తున్న కల్లాల కోసం 150 కోట్ల ను ఖర్చు చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. 150 కోట్లు తిరిగి చెల్లించాలంటూ కేంద్రం ఆదేశించడంతో ఆందోళనలు చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.