Telangana : సర్పంచ్ లకు గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్ సర్కార్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ సర్పంచ్ లకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు.

Update: 2024-11-21 05:40 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ సర్పంచ్ లకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. త్వరలోనే పంచాయతీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ పంచాయతీలకు సంబంధించి 750 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేసింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయీ పెట్టిన 1,200 కోట్లకు పైగా పంచాయతీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల కాలంలో బిల్లులు చెల్లించాలంటూ సర్పంచ్ లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. పలు చోట్ల ధర్నాలు చేసిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

పెండింగ్ లో ఉన్న...
పంచాయతీలకు పెండింగ్ లో ఉన్న బిల్లులను దశల వారీగా క్లియర్ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమయింది. నిధులతో జరిగిన పనులపై ఆరా తీసే పనిలో సరకార్ పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ లో ఉన్న బిల్లుల వివరాలను ఇవ్వాలని కోరింది. పంచాయతీల వారీగా పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎప్పుడు పూర్తయ్యాయి? వంటి వివరాలను అందించాలని పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లను కోరింది. అయితే ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో చేపట్టిన పనుల్లో 588 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రాధమికంగా తేలింది.
స్థానిక సంస్థల ఎన్నికలు...
పంచాయతీ బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచ్ లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో రేవంత్ ప్రభుత్వం ఈ బిల్లులను క్లియర్ చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ లకు అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలను బలంగా పంపేందుకు ఈ బిల్లులను క్లియర్ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే సర్పంచ్ లు అందరూ హ్యాపీగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ నిధుల విడుదలతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని భావిస్తుంది.


Tags:    

Similar News