Breaking: మంత్రుల గంగుల ఇంటికి సీబీఐ
కరీంనగర్ లో మంత్రుల గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు.
కరీంనగర్ లో మంత్రుల గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. రేపు ఢిల్లీకి వచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మూడు రోజుల క్రితం నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ ను ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో శ్రీనివాస్ మంత్రి గంగుల కమలాకర్ తో ఫొటోలు దిగినట్లు సీబీఐ అధికారులు కనుగొన్నారు.
టీఆర్ఎస్ ఎంపీకి కూడా...
శ్రీనివాస్ నకిలీ ఐపీఎస్ అధికారిగా అనేక మోసాలకు పాల్పడ్డారు. గంగుల కమలాకర్ తో ఆయనకు ఉన్న సంబంధాలేంటి? అన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీయనున్నారు. సీబీఐ అధికారిని అంటూ గతంలో శ్రీనివాస్ పై ఆరోపణలున్నాయి. గంగుల కమలాకర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవికి కూడా నోటీసులు జారీ చేశారు. రేపు ఢిల్లీలో సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.