ఆ రూట్ లో రైలు ప్రయాణం చేస్తున్నారా.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
తెలంగాణలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది
తెలంగాణలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం రాత్రి ఐరన్ ఓర్ లోడ్ తో వెళ్తున్న 11 వ్యాగన్ల గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రాఘవాపురం, రామగుండం స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడంతో 20 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరో పది రైళ్లను అధికారులు దారి మళ్లించారు. రెండు రైళ్లు రీషెడ్యూల్ చేశారు. ట్రాక్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
మంగళవారం అర్థరాత్రి రాఘవాపురం-రామగుండం మధ్య ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు పిటిఐకి తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున, బుధవారం ఇరవై ప్యాసింజర్ రైళ్ల ఆపరేషన్ రద్దు చేసినట్లు తెలిపారు. అదనంగా, భారతీయ రైల్వే యొక్క దక్షిణ మధ్య రైల్వే (SCR) డివిజన్ పది కంటే ఎక్కువ రైళ్లను దారి మళ్లించింది. కొన్నింటిని రీషెడ్యూల్ చేసింది.