దసరాకు అందరికీ గుడ్ న్యూస్ చెప్పనున్నాం : రేవంత్

తెలంగాణలో ఎంపికయిన టీచర్లకు అక్బోబరు 9వ తేదీన నియామక పత్రాలను అందచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2024-09-30 07:09 GMT

Revanth reddy

తెలంగాణలో ఎంపికయిన టీచర్లకు అక్బోబరు 9వ తేదీన నియామక పత్రాలను అందచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ 2024 ఫలితాలను ఆయన సచివాయంలో విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడు వేల పోస్టులను మాత్రమే పదేళ్లలో భర్తీ చేశారన్నారు. దసరా లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి దసరా రోజున నియామక పత్రాలను అందచేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు దసరా పండగ అతి ముఖ్యమైనదని, అందుకే ఆరోజు నియామక పత్రాలను అందచేస్తామని చెప్పారు.

నియామక పత్రాలపై...
11,062 పోస్టులకు 2,45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. త్వరలో గ్రూప్ 1 పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీని నిర్వహించామని చెప్పారు. ఇంకా ఖాళీలుంటే వాటిని కూడా భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాల నియామకాల విషయంలో తమ ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Tags:    

Similar News