Revanth Reddy : ఇక్కడ గెలిస్తే అక్కడ అధికారంలోకి వచ్చినట్లే
సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. దానం నాగేందర్ కు ఢిల్లీలో పెద్ద పదవి దక్కుతుందని అన్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. దానం నాగేందర్ కు మంచి పదవి ఇప్పించే బాధ్యత తనది అని రేవంత్ రెడ్డి అన్నారు. జంటనగరాలను వరదలు ముంచెత్తితే కిషన్ రెడ్డి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
ఆయన మంచోడే కానీ...
పద్మారావు గౌడ్ మంచోడే కానీ ఆయన బాస్ మాత్రం ఖతర్నాక్ అని రేవంత్ రెడ్డి అన్నారు. పద్మారావు నామినేషన్ కార్యక్రమానికి కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసే నట్లేనని అన్నారు. సికింద్రాబాద్ సీటును బీజేపీకి తాకట్టు పెట్టారన్నారు. ఇక్కడ మన ప్రభుత్వం ఉందని, బస్తీలో ఉన్న పేదలకు పథకాలను అందచేయాలంటే దానం నాగేందర్ గెలవాలన్నారు. మతసామరస్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని అన్నారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. జంటనగరాలకు మంచి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.