పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై పోలీస్ స్టేషన్ లో నేడు కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది

Update: 2023-01-06 06:20 GMT

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై మెయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నేడు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు సీఎల్పీలో భేటీ కానున్నారు. అక్కడి నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళతారు.

ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు...
పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినందున వారికి చేకూరిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి ఫిర్యాదులో కాంగ్రెస్ నేతలు పేర్కొననున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్, సీబీఐ హైకోర్టులలో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడం విశేషం.



Tags:    

Similar News